Renigunta: కట్టపుట్టలమ్మ జాతరలో ట్రాఫిక్ పాయింట్లను పరిశీలించిన పోలీసులు

Renigunta: రేణిగుంట కట్టపుట్టలమ్మ జాతరలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను డీఎస్పీ శ్రీనివాస రావు, సీఐ జయచంద్ర పరిశీలించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 8 Sept 2026 8:37 PM IST
Renigunta
X

Renigunta: కట్టపుట్టలమ్మ జాతరలో ట్రాఫిక్ పాయింట్లను పరిశీలించిన పోలీసులు

రేణిగుంట: కట్టపుట్టలమ్మ జాతర సందర్భంగా భక్తుల రద్దీ, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా డీఎస్పీ శ్రీనివాస రావు, సీఐ జయచంద్ర,జాతర పరిసర ప్రాంతాల్లోని ముఖ్యమైన ట్రాఫిక్‌ పాయింట్లను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్‌ ప్రాంతాలు, భక్తుల రద్దీ తదితర అంశాలను పరిశీలించారు.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సిబ్బందికి సూచించారు. జాతర పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్‌ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story