Renigunta: బి.టెక్ విద్యార్థి తలపై బాటిల్‌తో కొట్టిన తోటి బ్యాచ్!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బి.టెక్ విద్యార్థి రాకేశ్ పై దాడి చేసిన విజయ్, సుజన్, శ్రీనులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Renigunta: బి.టెక్ విద్యార్థి తలపై బాటిల్‌తో కొట్టిన తోటి బ్యాచ్!
రేణిగుంట: రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కరకంబాడి రోడ్డులో ఉన్న అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో విద్యార్థిపై దాడి జరిగిన ఘటనకు సంబంధించి రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.
ఫిర్యాదుదారు కోటిరాజు రాకేశ్ (20 సంవత్సరాలు), బి.టెక్ మూడవ సంవత్సరం విద్యార్థి, నగిరి పట్టణం, రామయ్య నాయుడు కాలనీ నివాసి. ఫిర్యాదు మేరకు, ఈ నెల 21-07-2026 తేదీన కళాశాల ముగించుకుని జిరాక్స్ షాప్ వద్ద ఆటో కోసం వేచి ఉన్న సమయంలో అదే కళాశాలలో చదువుతున్న విజయ్, సుజన్ మరియు శ్రీను అనే ముగ్గురు వ్యక్తులు అతనితో గొడవపడి, విజయ్ తన చేతిలో ఉన్న కూల్‌డ్రింక్ బాటిల్‌తో తల వెనుక భాగంలో కొట్టడంతో రక్తగాయం అయినట్లు, అనంతరం ముగ్గురూ కలిసి చేతులతో, కాళ్లతో దాడి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాడి అనంతరం స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు, గాయపడిన విద్యార్థి తిరుపతిలోని మెడిగో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం 22-07-2026 తేదీన రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఫిర్యాదు ఆధారంగా రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రజలకు విజ్ఞప్తి, విద్యాసంస్థల పరిసరాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.యువత వ్యక్తిగత విభేదాలను హింసాత్మక మార్గంలో కాకుండా చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని రేణిగుంట పోలీసులు సూచించారు.




