Renigunta Police Station: పైకప్పు ఊడిపోతున్నా విధుల్లోనే పోలీసులు… రేణిగుంట స్టేషన్ దారుణ పరిస్థితి
Renigunta Police Station: రేణిగుంట పోలీస్ స్టేషన్ భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయేలా తయారైంది. పైకప్పు సిమెంట్ పెచ్చులు ఊడిపోతుండటంతో ప్రాణభయంతో విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీస్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Renigunta Police Station: పైకప్పు ఊడిపోతున్నా విధుల్లోనే పోలీసులు… రేణిగుంట స్టేషన్ దారుణ పరిస్థితి
Renigunta Police Station: రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ఆందోళనకర పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి.స్టేషన్ భవనం పైకప్పు పూర్తిగా దెబ్బతిని,సిమెంట్ పొరలు ఊడిపోవడంతో ఇనుప రాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూలిపోతుందోనని పోలీస్ సిబ్బంది భయాందోళనల మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజలకు రక్షణగా నిలిచే పోలీసులే ప్రాణ భయంతో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.
వర్షాలు పడితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు కూడా పైకప్పు పరిస్థితిని చూసి భయపడుతున్నారు. ఏ క్షణంలోనైనా పెచ్చులు ఊడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేణిగుంట పోలీస్ స్టేషన్ భవనానికి మరమ్మతులు చేపట్టాలని పోలీసు సిబ్బంది,ప్రజలు కోరుతున్నారు.




