Renigunta: కలెక్టర్ ఆదేశాలకే విలువ లేదా..? రేణిగుంటలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం!
Renigunta: రేణిగుంటలో ఎన్నికల సెలవులను ఖాతరు చేయని ప్రైవేట్ పాఠశాలలు. ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ నేపథ్యంలో ఆదేశాలు జారీ చేసినా యథావిధిగా తరగతులు.
రేణిగుంట: స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రేణిగుంట మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు ప్రకటించినప్పటికీ, కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ఆ ఆదేశాలను పట్టించుకోకుండా పాఠశాలలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినప్పటికీ, కొన్ని పాఠశాలల యాజమాన్యాలు వాటిని ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను సైతం పట్టించుకోకపోతే ఇక నిబంధనలకు విలువ ఎక్కడ ఉంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ప్రకటించిన సెలవులను అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి పాఠశాల యాజమాన్యంపై ఉంది. అయినప్పటికీ నిబంధనలను పక్కనపెట్టి పాఠశాలలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమన్నది ప్రశ్నార్థకంగా మారింది.




