Renigunta: రేణిగుంట రైల్వే సంత గేటు 10 రోజుల పాటు మూసివేత!
Renigunta: రేణిగుంట–తిరుపతి రైల్వే మార్గంలోని LC 112 సంత గేటును యార్డు ఆధునీకరణ పనుల కోసం ఈ నెల 13 నుంచి 22 వరకు 10 రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Renigunta: రేణిగుంట రైల్వే సంత గేటు 10 రోజుల పాటు మూసివేత!
Renigunta: రేణిగుంట రైల్వే యార్డు ఆధునీకరణ పనుల్లో భాగంగా రేణిగుంట–తిరుపతి రైల్వే మార్గంలోని ఎల్‌సీ నంబర్ 112 గేటును 10 రోజుల పాటు మూసివేయనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు.రైల్వే శాఖ అధికారులు జారీ చేసిన ప్రకటన ప్రకారం, ఈ నెల 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రేణిగుంట రైల్వే యార్డు పరిధిలోని కిలోమీటర్ 83/12-14 వద్ద ఉన్న రైల్వే గేటు ద్వారా రహదారి రాకపోకలను నిలిపివేయనున్నారు. కొత్త రైల్వే ట్రాక్ ఏర్పాటు, ట్రాక్‌ను కమిషనింగ్ కోసం సిద్ధం చేయడం, లిఫ్టింగ్ బ్యారియర్ బూమ్‌ల మార్పు తదితర పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో రైల్వే గేటు మీదుగా ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రేణిగుంట మండల రెవెన్యూ అధికారులను రైల్వే శాఖ కోరింది.ప్రజలకు,వాహనదారులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.




