Renigunta: రేణిగుంట రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.. కలకలం రేపిన ఘటన!

Renigunta Railway Station: తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఘోరం జరిగింది. రెండవ నెంబర్ ప్లాట్‌ఫారం రైల్వే ట్రాక్‌పై ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 29 Jun 2026 9:49 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.. కలకలం రేపిన ఘటన!

Renigunta Railway Station: తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ లోని రెండవ నెంబర్ ప్లాటుఫారం రైల్వే ట్రాక్‌పై ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా కనిపించాడు.ఘటన ఆత్మహత్యా, ప్రమాదవశాత్తూ జరిగిందా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రూయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడి వద్ద భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు సంబంధించిన రైలు టికెట్ లభ్యమైనట్లు సమాచారం.దీంతో మృతుడి గుర్తింపుతో పాటు ఘటనకు గల కారణాలపై రైల్వే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story