Renigunta: రేణిగుంటలో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య పై సీఐ జయచంద్ర ప్రెస్ మీట్
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణం బుగ్గవీధిలో నివాసముంటున్న రైల్వే టెక్నీషియన్ కిల్లి రవి (36) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Renigunta: రేణిగుంటలో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య పై సీఐ జయచంద్ర ప్రెస్ మీట్
Renigunta: రేణిగుంట పట్టణంలోని బుగ్గవీధి ప్రాంతంలో నివాసముంటున్న కిల్లి రవి (36) అనే వ్యక్తి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.మృతుడు రైల్వే శాఖలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సీఐ జయచంద్ర తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, మృతుడి సోదరుడు కిల్లి విష్ణుకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిల్లి రవి గత కొంతకాలంగా కుటుంబ పరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు,
ఉద్యోగ సంబంధిత సమస్యలు, అలాగే తిరుపతికి చెందిన ఉషారాణి అనే మహిళతో ఏర్పడిన వివాదాల కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తన సోదరుడికి వాట్సాప్ ద్వారా ఓ సందేశం పంపిన అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
కుటుంబ సభ్యులు గమనించి స్థానికులకు సమాచారం ఇవ్వగా, వెంటనే పోలీసులకు విషయం తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని ఎస్.వి. మెడికల్ కాలేజ్ మార్చురీకి తరలించారు.
మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదులో ఉషారాణితో ఏర్పడిన వివాదాలు, ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌కు గురికావడం,ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జయచంద్ర వెల్లడించారు.




