Renigunta: ఎండల ఉక్కపోత నుంచి వర్షంతో ఊరట

Renigunta: రేణిగుంటలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు బుధవారం సాయంత్రం కురిసిన వర్షం చల్లటి వాతావరణాన్ని అందించి ఊరటనిచ్చింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 7 Oct 2026 4:42 PM IST
Renigunta
X

Renigunta: ఎండల ఉక్కపోత నుంచి వర్షంతో ఊరట

రేణిగుంట: ఓ వైపు ఉక్కపోత,మరోవైపు దంచికొడుతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న రేణిగుంట ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.

గత కొంతకాలంగా ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు కొంత ఊరట చెందారు. వర్షం మరింతగా కురిస్తే ఎండల తీవ్రత తగ్గడంతో పాటు వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA