Renigunta: రేణిగుంట సర్పంచ్ బరిలో జగదీష్ చిత్ర.. అట్టహాసంగా నామినేషన్!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మద్దతుతో జగదీష్ చిత్ర అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.
Renigunta: రేణిగుంట సర్పంచ్ బరిలో జగదీష్ చిత్ర.. అట్టహాసంగా నామినేషన్!
రేణిగుంట: రేణిగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థిగా జగదీష్ చిత్ర నిలిచారు. తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్చార్జి డి.పి. పుష్పనాదం కోడలైన జగదీష్ చిత్ర, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా తొలుత రేణిగుంటలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకుని ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి జగదీష్ చిత్ర మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం కల్పించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రేణిగుంట ప్రజలు తనకు ఒక అవకాశం ఇచ్చి, సర్పంచ్‌గా గెలిపించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.




