Renigunta: విద్యుత్ కాంతులతో మెరిసిన రేణిగుంట గంగ జాతర
Renigunta: గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా విద్యుత్ కాంతులు, రంగురంగుల దీపాలతో అలంకరించిన రేణిగుంట పట్టణం.
Renigunta: విద్యుత్ కాంతులతో మెరిసిన రేణిగుంట గంగ జాతర
రేణిగుంట: గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జాతరను పురస్కరించుకుని ఆలయ పరిసరాలు, ప్రధాన వీధులను రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రాత్రివేళ విద్యుత్ కాంతులతో రేణిగుంట పట్టణం కొత్త శోభను సంతరించుకుంది.
జాతరకు తరలివస్తున్న భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జాతర ప్రాంతం సందడిగా మారింది.
Next Story




