Renigunta: రేణిగుంటలో ఎస్ఐఆర్ రద్దు డిమాండ్!
Renigunta: రేణిగుంటలో ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
Renigunta: రేణిగుంటలో ఎస్ఐఆర్ రద్దు డిమాండ్!
Renigunta: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను రద్దు చేసి, తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రేణిగుంటలో వామపక్ష, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
రేణిగుంట పంచాయతీ కార్యాలయం వద్ద సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్, సీపీఐ, వైసీపీ, జనసేనతో పాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ వల్ల ఓటర్ల హక్కులకు నష్టం కలగకుండా చూడాలని వారు కోరారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా రేణిగుంట పంచాయతీ కార్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ నిర్వహించి, ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి నిరసన చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు హరినాథ్ తెలిపారు.




