Renigunta: రేణిగుంటలో పెట్రోల్ బంకులపై తాసిల్దార్ తనిఖీలు!

Renigunta: రేణిగుంట మండలంలో పెట్రోల్ బంకులపై తాసిల్దార్ శ్యామ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 26 April 2026 5:11 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో పెట్రోల్ బంకులపై తాసిల్దార్ తనిఖీలు!

Renigunta: తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు రేణిగుంట మండల తాసిల్దార్ శ్యామ్ ఆదివారం మండల పరిధిలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోలు బంకు యజమానులకు పలు సూచనలు జారీ చేశారు.

పెట్రోల్ కోసం వచ్చే వాహనదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని తాసిల్దార్ సూచించారు. ముఖ్యంగా వాటర్ బాటిళ్లు, క్యాన్‌లలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోలు నింపకూడదని కఠినంగా హెచ్చరించారు. అదేవిధంగా,

రోజువారీగా ఎంత పెట్రోల్ స్టాక్ వచ్చిందీ,ఎంత వినియోగమైందీ అనే వివరాలను బ్లాక్‌బోర్డ్‌పై స్పష్టంగా నమోదు చేసి ప్రదర్శించాలని ఆదేశించారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story