Renigunta: పార్టీల ఇంటింటి ప్రచారం.. ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు!

Renigunta: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టిడిపి క్లస్టర్ ఇన్‌చార్జ్ పుష్పనాదం ఆధ్వర్యంలో విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 3 Aug 2026 10:39 PM IST
Renigunta
X

Renigunta: పార్టీల ఇంటింటి ప్రచారం.. ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు!

రేణిగుంట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన ప్రత్యేక ఇంటింటి ప్రచార కార్యక్రమం రేణిగుంట పట్టణంలోని 170, 171 బూత్‌ల పరిధిలో సోమవారం నిర్వహించారు.

రేణిగుంట మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, క్లస్టర్ ఇన్‌చార్జ్ పుష్పనాదం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పుష్పనాదం మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలను ప్రజలకు వివరించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రచార కార్యక్రమంలో ప్రజల సమస్యలు, వినతులను స్వీకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం పారదర్శక పాలనతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో 170వ బూత్ ఇన్‌చార్జిలు నవాబ్, చిత్ర, అంబికాపతి, కన్నారెడ్డి, సాగర్, సుమన్, యూనిట్ ఇన్‌చార్జ్ జగదీష్, నిత్య తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story