Renigunta: రేణిగుంట స్మశాన వాటికను పరిశీలించిన టీడీపీ నాయకుడు మహబూబ్ బాషా!

Renigunta: రేణిగుంట స్మశాన వాటికలో మద్యం సీసాలు పడేయడంపై టీడీపీ నాయకుడు మహబూబ్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మశాన వాటిక పవిత్రతను కాపాడాలని అధికారులను కోరారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 12 Oct 2026 8:34 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట స్మశాన వాటికను పరిశీలించిన టీడీపీ నాయకుడు మహబూబ్ బాషా!

Renigunta: రేణిగుంట పట్టణంలోని స్మశాన వాటికలో కొందరు ఆకతాయిలు మద్యం సేవించి సీసాలను అక్కడే పడవేస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. పవిత్రంగా భావించే సమాధుల మధ్య ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తుండటంతో స్మశాన వాటిక అపరిశుభ్రంగా మారుతోంది. ఈ దారుణ ఘటనల పట్ల స్థానిక ముస్లింలు తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​ఈ సమస్యను స్థానికులు రేణిగుంట టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన.. స్వయంగా స్మశాన వాటికను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. సమాధుల మధ్య మద్యం సీసాలు పడి ఉండటాన్ని చూసి ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్మశాన వాటిక పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇలాంటి చర్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు.

​ఈ విషయాన్ని తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, స్మశాన వాటికలో పరిశుభ్రతను పునరుద్ధరించాలని స్థానికులు మహబూబ్ బాషాను కోరారు. అలాగే, పవిత్ర స్థలాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA