Renigunta: రేణిగుంట టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషాకు ఘన సత్కారం

Renigunta: రేణిగుంట పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ చిత్ర, వార్డు సభ్యుల గెలుపునకు కృషి చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషాను నేమ్ చంద్ సత్కరించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 29 Nov 2026 7:49 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషాకు ఘన సత్కారం

రేణిగుంట: రేణిగుంట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి విశేషంగా కృషి చేసిన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషాకు పీఆర్జీ జ్యువెలర్స్ నేమ్ చంద్ ఘనంగా సత్కరించారు. మహబూబ్ బాషా నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నేమ్ చంద్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి చిత్ర విజయానికి మహబూబ్ బాషా ఎంతో కృషి చేశారని కొనియాడారు. అలాగే వివిధ వార్డుల్లో పోటీ చేసిన వార్డు సభ్యుల గెలుపులోనూ కీలకంగా వ్యవహరించి, అభ్యర్థులకు చేదోడువాదోడుగా నిలిచారని ప్రశంసించారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన మహబూబ్ బాషా సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA