Renigunta: నామినేషన్లలో రేణిగుంటకు మొదటి స్థానం.. 394 దాఖలు!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో మొత్తం 394 నామినేషన్లు నమోదయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 116, వార్డులకు 278 నామినేషన్లు వచ్చాయి.
Renigunta: నామినేషన్లలో రేణిగుంటకు మొదటి స్థానం.. 394 దాఖలు!
రేణిగుంట: గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా రేణిగుంట మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో మొత్తం 394 నామినేషన్లు నమోదయ్యాయి. ఇందులో సర్పంచ్ స్థానాలకు 116 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 278 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
పంచాయతీల వారీగా చూస్తే రేణిగుంట గ్రామ పంచాయతీ 53 నామినేషన్లతో మొదటి స్థానంలో నిలిచింది. కరకంబాడి 51 నామినేషన్లతో రెండో స్థానంలో, తూకివాకం 35 నామినేషన్లతో మూడో స్థానంలో ఉన్నాయి. గాజులమండ్యం నుంచి 34, ఎలమండ్యం నుంచి 28, కృష్ణాపురం నుంచి 27 నామినేషన్లు వచ్చాయి.
అలాగే జీపాలెం, వెంకటాపురం పంచాయతీల్లో 24 చొప్పున, మామండూరులో 21, గురవరాజుపల్లెలో 20 నామినేషన్లు నమోదయ్యాయి. సూరప్పకాసం, ఆర్.మల్లవరం పంచాయతీల్లో 11 చొప్పున, సుబ్బరామపురం, కొట్రామంగళం పంచాయతీల్లో 10 చొప్పున నామినేషన్లు వచ్చాయి. గుత్తివారిపల్లె, వేదళ్లచెరువు, విప్పనపట్టెడ పంచాయతీల్లో 9 చొప్పున, అత్తూరు, తాండ్లం పంచాయతీల్లో 4 చొప్పున నామినేషన్లు నమోదయ్యాయి.
మొత్తంగా మండలంలోని అన్ని పంచాయతీల్లో కలిపి 394 నామినేషన్లు రావడంతో ఎన్నికల సందడి నెలకొంది. ముఖ్యంగా రేణిగుంట, కరకంబాడి, తూకివాకం పంచాయతీల్లో అభ్యర్థుల నుంచి ఎక్కువ పోటీ కనిపించింది.




