Renigunta: దిగువ మల్లవరం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

Renigunta: రేణిగుంట దిగువ మల్లవరం హైవే పక్కన అపస్మారక స్థితిలో కనిపించిన గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి. మృతుడి ఆచూకీ తెలిపాలని పోలీసుల కోరారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 4 Sept 2026 8:42 PM IST
Renigunta
X

Renigunta: దిగువ మల్లవరం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

రేణిగుంట: దిగువ మల్లవరం గ్రామ సమీపంలోని హైవే పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి ఉదయం 9 గంటల సమయంలో హైవే పక్కన అపస్మారక స్థితిలో కనిపించాడు.

సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతి చెందినట్లు తెలిపారు.

మృతదేహాన్ని పరిశీలించగా ఎలాంటి గాయాలు కనిపించలేదని, అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడి వద్ద గుర్తింపు వివరాలు లభించకపోవడంతో ఆయన ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతడిని గుర్తించిన వారు రేణిగుంట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story