Renigunta: వినాయక చవితి వేడుకలకు నిబంధనలు తప్పనిసరి.. సీఐ జయచంద్ర!

Renigunta: రేణిగుంటలో వినాయక చవితి వేడుకలపై అర్బన్ సీఐ జయచంద్ర హెచ్చరిక. డిజేలు, అశ్లీల నృత్యాలు నిషేధం. రహదారులకు అడ్డంగా మండపాలు పెట్టొద్దని సూచన.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 13 Sept 2026 11:26 AM IST
Renigunta
X

Renigunta: వినాయక చవితి వేడుకలకు నిబంధనలు తప్పనిసరి.. సీఐ జయచంద్ర!

Renigunta: వినాయకుడి మండపాలను వాహనాల రాకపోకలకు, బాటసారులకు అడ్డుగా ఏర్పాటు చేయకూడదు. అడ్డంకిగా ఉన్న వాటిని వెంటనే తొలగించాలి.మండపాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదా అసౌకర్యం కలిగించరాదు.

ఉత్సవాల పేరుతో డిజె (DJ) సౌండ్ సిస్టమ్‌లు వాడటం మరియు అశ్లీల డాన్సులు ఏర్పాటు చేయడం పూర్తిస్థాయిలో నిషేధించడమైనది. భక్తులు, నిర్వాహకులు అందరూ పోలీస్ నియమ నిబంధనలను పాటించి, వేడుకలను ప్రశాంతంగా, సక్రమంగా జరుపుకోవాలని రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర కోరారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA