Renigunta: జోరు వర్షంలోనూ వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం మాజీ ఎమ్మెల్యే

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో జోరు వర్షంలోనూ వైఎస్సార్‌సీపీ ఇంటింటి ప్రచారం. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన నేతలు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 2 Nov 2026 7:41 PM IST
Renigunta
X

Renigunta: జోరు వర్షంలోనూ వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం మాజీ ఎమ్మెల్యే

రేణిగుంట: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రేణిగుంట మండలం, తూకివాకం,తండ్లం, కొట్టరమంగళం,సురప్పకసం లో మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి గంగారి సుజాతని అలాగే ఎంపీటీసీ సభ్యులు నాగరాజ్, హేమలత, దిలీపులను అఖండ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం గఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఒక మంచి మనసున్న నాయకుడు,ఎవరు ఏ సమస్య చెప్పిన ఆయన సమస్యల భావించి ప్రజల పక్షాన నిలిచే రమేష్ సతీమణి గంగారి సుజాత ని జడ్పిటిసి అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు.

అలాగే జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు అండగా ఉన్నారని కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని అన్నారు. గడపగడపలో ప్రజలు ఎన్నో సమస్యలు తెలుపుతున్నారని వాళ్ళ బాధను అన్నింటిని ఓటు రూపంలో చూపించబోతున్నారు అన్నారు.జడ్పిటిసి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మరోసారి కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిద్ధగుంట సుధాకర్ రెడ్డి,తిరుమలరెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి,సంధ్య,ఆనంద్ మునిశేఖర్ రెడ్డి చిన్నప్ప శేఖర్ బాబు శ్రీనివాసులు పలని సునీల్ మునిశేఖర్ గౌడ్ సుధాకర్ గౌడ్, ముని రామయ్య సుబ్రహ్మణ్యం నాగరాజు శివ ఢిల్లీ బాబు నవీన్ ప్రవీణ్ సుబ్బు కూలి రవి లక్ష్మీనారాయణ రామ్ చెంగ రెడ్డి క్రాంతి వేణుగోపాల్ రెడ్డి శ్రీహరి కిరణ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA