Renigunta: అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. ఒంగరం గుర్తును గెలిపించండి
Renigunta: నవంబర్ 26 రేణిగుంట పంచాయతీ ఎన్నికల్లో ఒంగరం గుర్తు అభ్యర్థి నిర్మల కుమారిని గెలిపించాలని వైసీపీ విజ్ఞప్తి; చిరువ్యాపారులకు పన్నుల రద్దు హామీ.
Renigunta: రేణిగుంట ఎన్నికల్లో బొంగరం గుర్తుకు ఓటేయండి
రేణిగుంట: నవంబర్ 26న జరగనున్న రేణిగుంట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గత ఐదేళ్ల అభివృద్ధిని, ప్రస్తుత పాలనను గుర్తు పెట్టుకొని ఓటు వేయాలని వైఎస్సార్సీపీ నాయకులు ప్రజలను కోరారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ సతీమణి సర్పంచ్ అభ్యర్థి వి. నిర్మల కుమారి (ఒంగరం గుర్తు) తరపున పలు హామీలను ప్రకటించారు.
తాము గెలిస్తే ప్రతి వార్డుకు ప్రత్యేక ఉద్యోగిని నియమించి, ప్రజా సమస్యలను గంటలోపు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు, దోమల మందు పిచికారీని క్రమం తప్పకుండా చేపడతామన్నారు. చిరువ్యాపారులపై విధిస్తున్న పన్నులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
గత ఐదేళ్ల పాలనలో 6 వేల మీటర్ల సిమెంట్ రోడ్లు, 3,500 మీటర్ల మేర డ్రైనేజీ కాలువలు నిర్మించామని, పాంచాలి నగర్ ముంపు సమస్య పరిష్కారానికి రూ.కోటి వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టామని వివరించారు. సీబీఐడీ కాలనీలో రూ.60 లక్షలతో రోడ్లు నిర్మించామని గుర్తుచేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే నిర్మల కుమారిని ఒంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వైఎస్సార్సీపీ నాయకులు రేణిగుంట ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




