Renigunta: రేణిగుంటలో రోడ్డు ప్రమాదం బైక్ ఢీకొని విద్యార్థినికి తీవ్ర గాయాలు!

Renigunta: రేణిగుంట జడ్పీ బాలికల హైస్కూల్ సమీపంలో అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొని 6వ తరగతి విద్యార్థినికి తీవ్ర గాయాలు. స్పృహతప్పిన చిన్నారి ఆసుపత్రికి తరలింపు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 1 Sept 2026 9:40 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో రోడ్డు ప్రమాదం బైక్ ఢీకొని విద్యార్థినికి తీవ్ర గాయాలు!

Renigunta: రేణిగుంటలోని జడ్పీ బాలికల హైస్కూల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బడికి వెళ్తున్న ఆరవ తరగతి విద్యార్థినిని అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.

​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు రోజూ మాదిరిగానే పాఠశాలకు వెళ్తుండగా, ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన పల్సర్ 125 సి సి బైక్ ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోయింది.

​అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని చూసి చుట్టుపక్కల వారు వెంటనే స్పందించారు. స్థానిక వాహనం సహాయంతో తక్షణమే ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

​ఉదయం వేళల్లో ట్రాఫిక్.... నిబంధనలు కరవు:

పాఠశాలల వేళల్లో రద్దీగా ఉండే ప్రాంతాలలో ఇలాంటి అతివేగపు వాహనాల దూకుడు పెరిగిపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ సమయాల్లో పోలీస్ సిబ్బందిని నియంత్రించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story