Srikalahasti: శ్రీకాళహస్తి విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన
Srikalahasti: శ్రీకాళహస్తి రవాణా శాఖ కార్యాలయంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన. హెల్మెట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించిన అధికారి దామోదర్ నాయుడు.
Srikalahasti: శ్రీకాళహస్తి విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి కార్యాలయంలో విద్యార్థులకు రవాణా శాఖ సేవలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైతన్య పాఠశాలకు చెందిన సుమారు 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ, చిన్నతనం నుంచే రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని తెలిపారు. రవాణా శాఖ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ, లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
విద్యార్థులకు కార్యాలయంలోని డ్రైవింగ్ ట్రాక్‌ను చూపించి దాని ఉపయోగాన్ని వివరించారు. అలాగే ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, తమ తల్లిదండ్రులు కూడా హెల్మెట్ ధరించినప్పుడే వాహనంపై ప్రయాణించాలని సూచించారు.
రహదారిపై నడిచేటప్పుడు ఎడమవైపున నడవాలని, రోడ్లపై ఆటలు ఆడకూడదని, 18 సంవత్సరాలు నిండని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య పాఠశాల ఉపాధ్యాయులు, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




