Puttur: పుత్తూరులో రైళ్లలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!
Puttur: తిరుపతి జిల్లా పుత్తూరు ఆర్పీఎఫ్ పరిధిలో రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న 800 కిలోల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని తహసీల్దార్‌కు అప్పగించారు.
Puttur: పుత్తూరులో రైళ్లలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!
పుత్తూరు: పుత్తూరు ఆర్పిఎఫ్ పరిధిలో రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్ ) బియ్యంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎవరూ క్లెయిమ్ చేయని 20 బస్తాల బియ్యం, సుమారు 800 కిలోల బరువుతో స్వాధీనం చేసుకున్నారు. ఆర్పిఎఫ్ సీఐ కె.పి. సెబాస్టియన్ పర్యవేక్షణలో ఎఎస్ఐ ఎస్. రవిచంద్రన్, సిబ్బంది వివిధ రైళ్లలో తనిఖీలు చేపట్టారు.
స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రాణిపేట తహసీల్దార్/ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు రసీదుతో అప్పగించారు. పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడం చట్టవిరుద్ధమని, అక్రమ రవాణాపై నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్పిఎఫ్ సీఐ తెలిపారు.
Next Story




