Srikalahasti: శ్రీకాళహస్తి ఆర్టీసీ కార్మికుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో నిరసన
Srikalahasti: శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్‌లో కార్మికుల నిరసన. బ్యాటరీ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దని డిమాండ్.
Srikalahasti: శ్రీకాళహస్తి ఆర్టీసీ కార్మికుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో నిరసన
శ్రీకాళహస్తి: ఆర్టీసీ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. బ్యాటరీ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా, ఆర్టీసీ ఉద్యోగులతోనే నడిపించాలని వారు డిమాండ్ చేశారు.
మొదటి డ్యూటీ నుంచే ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటూ తమ నిరసనను తెలియజేశారు. ఆర్టీసీని బలోపేతం చేయాలంటే కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యత కూడా ఆర్టీసీ ఉద్యోగులకే అప్పగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.ఎస్. కుమార్, డిపో జేఏసీ నాయకులు జి.పి.ఎస్. ఆచారి, లింగమూర్తి, శివకుమార్, ఎం.ఎస్. మన్య, ఎస్‌ఐజే, సాధిక్, జొన్నలగడ్డ మురళి, పట్టాభి, కుప్పయ్య, రమేష్ బాబు, సడక్, వై.డి. కుమార్, కే.సీ. రెడ్డి, నరసింహులు, టీవీ లక్ష్మి, పద్మ, మాధవి, రాజ్యలక్ష్మి, బీజే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులంతా తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిరసన కొనసాగించారు.




