Tirupati: గ్రామీణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ధనలక్ష్మి
Tirupati: తిరుపతి రూరల్ మండలం మల్లవరంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ముచ్చెలి ధనలక్ష్మి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తూ గ్రామాల అభివృద్ధికి హామీ ఇచ్చారు.
Tirupati: గ్రామీణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ధనలక్ష్మి
తిరుపతి: తిరుపతి రూరల్ మండలం మల్లవరంలో టీడీపీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థి ముచ్చెలి ధనలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మల్లవరం ఎంపీటీసీ మనోహర్ చౌదరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లు పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
టిడిపి జడ్పిటిసి అభ్యర్థి ధనలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజా సమస్యలు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. డ్రైనేజీ, రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.




