Tirupati: మెగా డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం మానాలి: శాప్ ఛైర్మన్
Tirupati: మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) చేస్తున్నది శుద్ధ దుష్ప్రచారమేనని శాప్ (SAAP) చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు.
Tirupati: మెగా డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం మానాలి: శాప్ ఛైర్మన్
Tirupati: మెగా డిఎస్సిపై వైసిపి దుష్ప్రచారం మానడం లేదు రవినాయుడు, శాప్ ఛైర్మన్. గవర్నర్ ను కలిసి బొత్స సత్యనారాయణ డిఎస్సిపై అబద్థాలు చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్సకు డిఎస్సి నియామకాలు ఎలా జరుగుతాయో తెలియదా? చిత్తూరు నాగయ్య బతికి ఉంటే వైసిపి నేతల నటన చూసి ఇప్పుడు చనిపోయేవారు.
డిఎస్సిలో స్ప్రోర్ట్స్ కోటాలో ఎలాంటి అక్రమాలు జరుగలేదు, జి.ఓ.నెంబర్ 77ప్రకారం నియామకాలు జరిగాయి. డిఎస్సి నియామకాల్లో కులప్రస్తావన తీసుకురావడం దారుణం, కమ్మ, కాపు, బిసి, దళితులంటే వైసిపి నేతలకు చిన్నచూపు. డిఎస్సి నియామకాలపై గుడ్డ కాల్చి మా ముఖంపై వేయాలని వైసిపి ప్రయత్నిస్తోంది. డిఎస్సిలో అక్రమాలు జరిగి ఉంటే ఎక్కడికైనా చర్చకు సిద్ధమని లోకేష్ సవాల్ విసిరారు.
లోకేష్ సవాల్ ను వైఎస్ జగన్ ఎందుకు స్వీకరించడం లేదు. సవాల్ స్వీకరించలేని జగన్ కు డీఎస్సీ పై మాట్లాడే అర్హత లేదు, వైసిపి నీచరాజకీయాలు చేస్తోంది. అమరావతి, పోలవరంపై విషప్రచారం చేస్తున్నారు. హోమ్ మంత్రి అనిత కట్టు బొట్టు గురించి మాట్లాడే నీచమైన స్థాయిలో వైసీపీ నాయకులు ఉన్నారు.
సీబీఐ ఆఫీసర్ల పై కేసులు పెట్టిన జగన్ నేడు డిఎస్సీ పై సీబీఐ విచారణ కోరడం ఎందుకు, కూటమి ప్రభుత్వం లో ఎవ్వరైనా చట్టానికి లోబడే ఉండాలి అది మా క్రమశిక్షణ. కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమం చూసి ఓర్వలేక వైసీపీ బురదజల్లుతోంది.




