Satyavedu: సత్యవేడులో అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా ఎంపికలు

Satyavedu: సత్యవేడులో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా ఎంపికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. క్రీడల్లో రాణించాలని యువతకు పిలుపు.

K. SURESH BABU, SATYAVEDU
Published on: 28 July 2026 5:34 PM IST
Satyavedu
X

Satyavedu: సత్యవేడులో అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా ఎంపికలు

సత్యవేడు: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం అమరావతి ఛాంపియన్‌షిప్– 2026 నియోజకవర్గ స్థాయి క్రీడా ఎంపికలు సత్యవేడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం క్రీడా ఎంపికలను ప్రారంభించి, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత క్రీడలను జీవితంలో భాగంగా చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, "క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోంది. సత్యవేడు నియోజకవర్గం నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఎదిగి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, చెస్, యోగా, హాకీ, ఆర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, వెయిట్‌లిఫ్టింగ్ తదితర విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభను పరిశీలించి ఎంపికలు నిర్వహించారు.

కార్యక్రమంలో ఎంఈవో రవి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు,ఎస్ ఐ లావణ్య, ప్రధానోపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు, క్రీడా అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు తదుపరి జిల్లా స్థాయి పోటీల్లో సత్యవేడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించనుండగా, విజేతలకు అధికారులు అభినందనలు తెలిపారు.

K. SURESH BABU, SATYAVEDU

K. SURESH BABU, SATYAVEDU

Next Story