Renigunta: రేణిగుంట సబ్-డివిజన్‌లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు..DSP!

Renigunta: రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో సెప్టెంబర్ 1 నుండి 30 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ వై.శ్రీనివాస రావు వెల్లడించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 1 Sept 2026 10:22 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట సబ్-డివిజన్‌లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు..DSP!

Renigunta: రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా,తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు,రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో 2026 సెప్టెంబర్ నెల 1 వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 30 వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్‌కు సంబంధించిన నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాస రావు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పోలీసు శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండా సభలు,సమావేశాలు,ర్యాలీలు, ధర్నాలు,రాస్తారోకోలు మరియు ఇతర గుంపులుగా నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు.రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలోని రేణిగుంట,గాజులమండ్యం, ఏర్పేడు,రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె,చిట్వేల్, పుల్లంపేట మరియు పెనగలూరు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు.

పై నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story