Sullurpeta: సూళ్ళూరుపేట తాగునీటి కోసం అల్లాడుతున్న పేర్నాడు గ్రామస్తులు

Sullurpeta: సూళ్ళూరుపేట మండలం పేర్నాడు హరిజనవాడలో తీవ్ర తాగునీటి సమస్య. కిలోమీటర్ల మేర నడుస్తూ ఇబ్బందులు పడుతున్న ప్రజలు. స్పందించాలని ఎమ్మెల్యేను వేడుకుంటున్న వైనం.

KKV Sudhakar, Sullurupeta
Published on: 11 July 2026 9:38 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేట తాగునీటి కోసం అల్లాడుతున్న పేర్నాడు గ్రామస్తులు

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలంలోని పేర్నాడు హరిజనవాడ గ్రామ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. గత కొంతకాలంగా మా గ్రామంలో మంచినీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. కనీస అవసరాలైన తాగునీరు కూడా అందక గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు.

ఎండలు మండుతున్న వేళ, కనీసం తాగడానికి గుక్కెడు నీరు దొరక్కపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి రావడం, గంటల తరబడి వేచి చూడాల్సి రావడం వల్ల మా దైనందిన జీవితం, పనులు పూర్తిగా దెబ్బతింటున్నాయి.

​"మేము కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలమే కదా, మాకు కనీసం తాగునీరు ఇచ్చే దిక్కు లేదా?" అని అధికారులు, ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తూ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, యుద్ధ ప్రాతిపదికన మా గ్రామానికి తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాము.

​సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గారు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే నాయకురాలు అని మాకు తెలుసు. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపే మీ దయ మా గ్రామంపై ఉండాలని మేమంతా కోరుకుంటున్నాము. పేర్నాడు హరిజనవాడలోని మా తాగునీటి కష్టాలను మీరు స్వయంగా గమనించి, శాశ్వత పరిష్కారం చూపవలసిందిగా కోరుతున్నాము. మీ చొరవతోనే మా గ్రామ ప్రజల దాహార్తి తీరుతుందని మేమంతా బలంగా నమ్ముతున్నాము.

​ట్యాంకర్ల ద్వారా అయినా నీటిని సరఫరా చేయాలని, బోర్లు వేయించి మా కష్టాలను తీర్చాలని ఎమ్మెల్యే గారిని, సంబంధిత అధికారులను వేడుకుంటున్నాము. ఇన్నాళ్లుగా మేము అనుభవిస్తున్న ఈ తాగునీటి సమస్యపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మా దీనస్థితిని అర్థం చేసుకుని, మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. ఈ విషయాన్ని అధికారులు ఇప్పటికైనా సీరియస్‌గా తీసుకుంటారా?

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story