Renigunta: అస్తవ్యస్తంగా పారిశుధ్యం.. చెత్తాచెదారంతో ప్రజల అవస్థలు!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగునీటి సమస్యలపై తక్షణమే పారిశుధ్య చర్యలు చేపట్టాలని సీఐటీయూ నేత కాంజేరి సెల్వరాజు డిమాండ్ చేశారు.
Renigunta: అస్తవ్యస్తంగా పారిశుధ్యం.. చెత్తాచెదారంతో ప్రజల అవస్థలు!
Renigunta: గ్రామపంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో పారిశుధ్య సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సీఐటీయూ రేణిగుంట మండల కన్వీనర్ కాంజేరి సెల్వరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేణిగుంటలోని పలు కాలనీల్లో చాలా రోజులుగా చెత్త పేరుకుపోవడంతో పాటు మురుగుకాలువలు శుభ్రం చేయకపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందన్నారు. దోమల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం కొనసాగితే ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రేణిగుంట ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో, బుగ్గ వీధి, వినాయక నగర్, గౌరీ నగర్, పాంచాలి నగర్ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, మురుగుకాలువల పరిస్థితిని ఆయన పరిశీలించి ఫొటోలు, వీడియోలు సేకరించారు.
సంబంధిత పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేయించాలని, చెత్తను తొలగించి గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సెల్వరాజు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.




