Renigunta: ఆపదలో ఉన్నారా? ఫోన్‌లో ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఎస్పీ కీలక ప్రకటన!

Renigunta: డిజిటల్ యుగంలో మహిళలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఐపీఎస్ ప్రత్యేక హెచ్చరికలు చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 22 May 2026 12:42 PM IST
Renigunta
X

Renigunta: ఆపదలో ఉన్నారా? ఫోన్‌లో ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఎస్పీ కీలక ప్రకటన!

Renigunta: రేణిగుంట మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ముఖ్య అతిథిగా హాజరై మహిళల రక్షణ, చట్టాలపై అవగాహన మరియు భద్రతా చర్యలపై విస్తృతంగా వివరించారు.

ఈ సందర్భంగా మహిళల భద్రత, రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు అధికారులు సమగ్ర అవగాహన కల్పించారు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, ఆన్లైన్ లావాదేవీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో మాట్లాడిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని మహిళలకు పిలుపునిచ్చారు. చట్టాలపై అవగాహన పెరిగితే నేరాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

మహిళలకు ఓటు హక్కుతో పాటు ఆస్తిలో సమాన హక్కులు కల్పించారని, మహిళల రక్షణ కోసం పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, నిర్భయ చట్టం వంటి పలు ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయని వివరించారు. పని ప్రదేశాల్లో గానీ, సమాజంలో గానీ మహిళలపై వేధింపులు లేదా అఘాయిత్యాలు జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఎలాంటి భయాలు లేకుండా మహిళలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తేనే చట్టాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయని తెలిపారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందన్నారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన “శక్తి యాప్”ను వినియోగించుకోవాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా వెంటనే పోలీసు సహాయం పొందవచ్చని తెలిపారు. అలాగే అత్యవసర సహాయం కోసం డయల్ 112, 181, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని మహిళలకు సూచించారు.

సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళల భద్రతా చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్న ఎస్పీ, ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగినా లేదా మహిళలకు సంబంధించిన సమస్యలు ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మహిళలు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఆపద సమయంలో భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story