Renigunta: రేణిగుంటలో ఘనంగా బక్రీద్: మస్జిద్-ఎ-మదీనాలో ప్రత్యేక ప్రార్థనలు!

Renigunta: రేణిగుంట మస్జిద్-ఎ-మదీనాలో ఘనంగా జరిగిన బక్రీద్ వేడుకలు. ప్రత్యేక నమాజ్‌లో పాల్గొన్న ముస్లింలు, దేశ శాంతి కోసం ప్రార్థనలు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 28 May 2026 1:00 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో ఘనంగా బక్రీద్: మస్జిద్-ఎ-మదీనాలో ప్రత్యేక ప్రార్థనలు!

Renigunta: త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగను రేణిగుంట పట్టణంలోని మస్జిద్-ఎ-మదీనాలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక ఈద్ నమాజ్‌ను శాంతియుత వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లింలు మస్జిద్‌కు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అల్లాహ్‌ను ప్రార్థించారు.

మత పెద్దలు బక్రీద్ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ త్యాగం, సేవాభావం,సోదరభావం మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమని తెలిపారు. నమాజ్ అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story