Chandragiri: పనపాకంలో శ్రీ సాయి సుధా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Chandragiri: చంద్రగిరి మండలం పనపాకం గ్రామంలో శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 16 Aug 2026 7:48 PM IST
Chandragiri
X

Chandragiri: పనపాకంలో శ్రీ సాయి సుధా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

చంద్రగిరి: శ్రీ సాయి సుధా మల్టీ స్పెషలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పనపాకం గ్రామం Zpp high school దగ్గర ఈ రోజు ఉదయం 10AM నుంచి మధ్యాహ్నం 2 PM వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం నందు సుమారు 100 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు, ఎముకల పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు. అవసరమైన వారికీ ఉచితంగా మందులు పంపిణి చేసారు.

డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 10 మందిని ఉచితంగా ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్ కు రెఫర్ చేశామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలియజేసారు.ఈ వైద్య శిబిరంలో కుమార్ , విశ్వనాధ్, మహేష్ , శ్రీరంజిని, బిందు. పనపాకం మేడసాని కుమార్ , నగరం రమేష్, బి.లోకేష్ ,పల్లినేని లతీష్ తదితరులు పాల్గొన్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story