Srikalahasthi: మద్యం దుకాణాల టెండర్లకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్
Srikalahasthi: శ్రీకాళహస్తి ఎక్సైజ్ పరిధిలో 10 మద్యం దుకాణాలకు టెండర్ల నోటిఫికేషన్. అక్టోబర్ 1 వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 5న లాటరీ కేటాయింపు.
Srikalahasthi: మద్యం దుకాణాల టెండర్లకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పరిధిలోని మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ లావణ్య తెలిపారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో 3, ఏర్పేడు పరిధిలో 3, తొట్టంబేడు పరిధిలో 3, బీఎన్ కండ్రిగ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం 10 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల దరఖాస్తు రుసుముతో పాటు రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్, హైబ్రిడ్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.
సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 5న ఉదయం 8 గంటలకు కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ విధానంలో మద్యం దుకాణాల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపికైన వారికి సమాచారం అందిస్తామని తెలిపారు.
మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం శ్రీకాళహస్తి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ను సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ లావణ్య సూచించారు.




