Srikalahasthi: ప్రధాని మోదీ జన్మదినం వేళ మెగా రక్తదాన శిబిరం
Srikalahasthi: శ్రీకాళహస్తిలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. స్వయంగా రక్తదానం చేసి ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్.
Srikalahasthi: ప్రధాని మోదీ జన్మదినం వేళ మెగా రక్తదాన శిబిరం
శ్రీకాళహస్తి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతీ ఆడిటోరియం (మధు హోటల్)లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా పరిపాలనలో దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
2047 నాటికి భారత్‌ను ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలపాలనే సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తం అందించేందుకు యువత, పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. శిబిరంలో బీజేపీ శ్రేణులతో పాటు కూటమి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.




