Srikalahasthi: శ్రీకాళహస్తిలో విజయవంతమైన విద్యాసంస్థల బంద్
Srikalahasthi: నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తి, తొండమనాడు, తొట్టంబేడులలో ఎస్ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం.
Srikalahasthi: శ్రీకాళహస్తిలో విజయవంతమైన విద్యాసంస్థల బంద్
శ్రీకాళహస్తి: ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంతో పాటు తొండమనాడు, తొట్టంబేడు మండలాల్లో విద్యాసంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో జరిగిన తీవ్రమైన అన్యాయమని అన్నారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పరీక్షలకు సిద్ధమవుతారని, అలాంటి పరిస్థితుల్లో పేపర్ లీక్ ఘటన వారి ఆశయాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని కూడా విద్యార్థి సంఘాలు ఖండించాయి. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరాయి. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు నాయకులతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.




