Srikalahasti: భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసుల ప్రత్యేక చర్యలు!

Srikalahasti: ఆడి కృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 5 Aug 2026 10:28 PM IST
Srikalahasti
X

Srikalahasti: భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసుల ప్రత్యేక చర్యలు!

శ్రీకాళహస్తి: ఆడి కృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

శ్రీకాళహస్తి డీఎస్పీ శ్రీ నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందజేశారు.

ఆలయ పరిసర ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు భక్తుల రాకపోకలను సజావుగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భక్తులు పోలీసు శాఖకు సహకరించి, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనాలు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story