Srikalahasti: శ్రీకాళహస్తి వద్ద రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

Srikalahasti: శ్రీకాళహస్తి మండలం తొండమనాడు ఫ్లైఓవర్ వద్ద రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన లక్ష్మణ్ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 24 Sept 2026 5:00 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తి వద్ద రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మండలం తొండమనాడు ఫ్లైఓవర్ సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, అతడిని శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI