Srikalahasti: హోరు వానలోనూ హోరాహోరీగా శ్రీకాళహస్తి కాంగ్రెస్ ప్రచారం

Srikalahasti: శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నెల్లూరు గాంధీ, కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో హోరువానలో కాంగ్రెస్ ప్రచారం.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 24 Nov 2026 7:34 PM IST
Srikalahasti
X

Srikalahasti: హోరు వానలోనూ హోరాహోరీగా శ్రీకాళహస్తి కాంగ్రెస్ ప్రచారం

శ్రీకాళహస్తి: హోరువానను సైతం లెక్కచేయకుండా శ్రీకాళహస్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో బహుదూరపేట, తెట్టు, కుమ్మరవీధి, నల్లగంగమ్మ గుడి వీధి, కొత్తపేట, ముత్యాలమ్మ గుడి వీధుల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నెల్లూరు గాంధీతో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు.

ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. నేటి యువత పోరాటాల ద్వారానే ప్రతి విజయాన్ని సాధించవచ్చని తెలిపారు. యువత ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సుపరిపాలన అందించే సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా, జిల్లా INC కలెక్టరేట్ రిప్రజెంటేటివ్ చైర్మన్ చిరంజీవి, జిల్లా OBC సెల్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆంటోనీ, శంకర్, నాగరాజు, మహేష్, బాబు, అరుణ్, చరణ్, జోసెఫ్, సారధి, చిరంజీవి, చందు, అజిత్, శాన్ మైకేల్, స్వామినాథన్, కుమార్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI