Srikalahasti: షికార్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్!

Srikalahasti: శ్రీకాళహస్తిలో 50 ఏళ్లుగా నివసిస్తున్న షికార్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్. తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన నాయకులు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 15 Sept 2026 12:47 PM IST
Srikalahasti
X

Srikalahasti: షికార్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్!

Srikalahasti: శ్రీకాళహస్తి పట్టణంలో సుమారు 50 ఏళ్లకు పైగా నివసిస్తున్న షికార్లకు (నక్కల వాళ్లు) ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉప తహసీల్దార్ రవిచంద్రకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ సుమారు 50 ఏళ్లుగా శ్రీకాళహస్తిలో జీవిస్తున్న షికార్లకు ఇప్పటికీ సొంత ఇళ్ల స్థలాలు లేకపోవడం అత్యంత శోచనీయమన్నారు. అధికారులు వెంటనే స్పందించి వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ పొట్టకూటి కోసం రోడ్లపై జీవనం కొనసాగిస్తున్న షికార్ల సమస్యను అధికారులు పట్టించుకోవాలని అన్నారు. వారికి న్యాయం జరిగేలా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు హరికృష్ణ, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వినోద్, ఓబీసీ జిల్లా నాయకులు రజాక్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI