Srikalahasti: శ్రీకాళహస్తి జెట్టిపాలెంలో వైభవంగా వినాయక ఉంజల సేవ!

Srikalahasti: శ్రీకాళహస్తి జెట్టిపాలెంలో ఘనంగా గణపతి ఉత్సవాలు. భక్తిశ్రద్ధలతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు ఉంజల సేవ.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 16 Sept 2026 10:56 AM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తి జెట్టిపాలెంలో వైభవంగా వినాయక ఉంజల సేవ!

Srikalahasti: శ్రీకాళహస్తి పట్టణంలోనీ జెట్టి పాలెం నందు శ్రీ వినాయక చవితి మహోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూనారు. గత 13 సంవత్సరాలుగా గణపతి మందిరాన్ని ఏర్పాటు చేసి, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ,భక్తుల సహకారం, పెద్దల ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఈ వేడుకలు మరింత వైభవంగా జరుగుతున్నాయి.

గత రెండు సంవత్సరాలుగా శ్రీ గణపతి స్వామి వారికి ఉంజల సేవను కూడా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు, నిర్వహించి, అనంతరం ఉంజల సేవను ఎంతో ఘనంగా నిర్వహించారు.

పూలతో అందంగా అలంకరించిన ఉయ్యాలో గణపతి స్వామివారిని కొలువుదీర్చి, మంగళహారతులు, భజనలు మరియు జయజయ ధ్వానాల మధ్య ఉంజల సేవను నిర్వహించారూ. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకలతో జెట్టి పాలెం మొత్తం భక్తి భావంతో, గణపతి నామస్మరణతో మార్మోగింది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI