Srikalahasti: శ్రీకాళహస్తికి కీర్తి తెచ్చిన కరాటే క్రీడాకారిణి కె. స్నేహప్రియ!

Srikalahasti: పాలకొండలో జరిగిన 70వ స్కూల్ గేమ్స్ కరాటే పోటీల్లో −30 కేజీల విభాగంలో శ్రీకాళహస్తి క్రీడాకారిణి కె. స్నేహప్రియ కాంస్య పతకం సాధించింది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 22 Nov 2026 2:53 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తికి కీర్తి తెచ్చిన కరాటే క్రీడాకారిణి కె. స్నేహప్రియ!

శ్రీకాళహస్తి: పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలంలోని జీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో నవంబర్ 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్న 70వ స్కూల్ గేమ్స్ కరాటే పోటీల్లో శ్రీకాళహస్తికి చెందిన కె. స్నేహప్రియ ప్రతిభ చాటింది.

సింహపురి కెనీ స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ ఇండియా శ్రీకాళహస్తి శాఖకు చెందిన స్నేహప్రియ −30 కేజీల విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఈ విజయంతో శ్రీకాళహస్తి పట్టణానికి, అకాడమీకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఈ సందర్భంగా అకాడమీ వ్యవస్థాపకులు, ప్రధాన శిక్షకులు డా. రెన్షి ధనుష్ మాట్లాడుతూ స్నేహప్రియ సాధించిన విజయం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ విజయానికి కృషి చేసిన కోచ్‌లకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్నేహప్రియకు పలువురు క్రీడాభిమానులు, స్థానికులు అభినందనలు తెలియజేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI