Srikalahasti: బడి పిలుస్తోంది సందడి.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పిలుపు!
Srikalahasti: శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ కార్యాలయంలో రైతులతో చైర్మన్ చెంచయ్య నాయుడు సమీక్ష నిర్వహించారు.
Srikalahasti: బడి పిలుస్తోంది సందడి.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పిలుపు!
శ్రీకాళహస్తి: మార్కెట్ కమిటీ కార్యాలయం నందు మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు, రైతులు తమ సమస్యలు మార్కెట్ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకుని వెళ్ళగా ప్రభుత్వం దృష్టికి రైతన్నల సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతానన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు మాట్లాడుతూ.. రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా నేడు సమీక్ష సమావేశం నిర్వహించామని, గత టిడిపి ప్రభుత్వంలో రైతన్నలకు వారికి కావలసిన యూరియా జిప్సం లాంటి ఎరువులను సబ్సిడీకి ఇచ్చే వారిని అదేవిధంగా రైతన్నలు కావలసిన పనిముట్లు సామాగ్రిని కూడా సబ్సిడీకి ఇచ్చేవారని ,అలాంటి సబ్సిడీ పథకాలు మళ్ళీ అమల్లోకి తీసుకురావాలని రైతుల కోరడంతో, రైతులు కోరిన కోరికలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి రైతన్నలకు సబ్సిడీ పథకాలు అందేలా కార్యాచరణ చేపడతామన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన బడి పిలుస్తుంది ప్రచార రథయాత్ర శ్రీకాళహస్తినియోజకవర్గంలో అత్యంత వేడుకగా నిర్వహింపబడుతుందని, చిన్నారుల తల్లితండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాల బలోపితం చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని కోరారు.




