Srikalahasti: శ్రీకాళహస్తిలో మెడికల్ షాపుల సమ్మెకు మద్దతుగా భారీ ర్యాలీ

Srikalahasti: ఆన్‌లైన్ ఫార్మసీ విధానానికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 20 May 2026 11:51 AM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో మెడికల్ షాపుల సమ్మెకు మద్దతుగా భారీ ర్యాలీ

Srikalahasti: ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈనెల 19వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 12 గంటల వరకు మెడికల్ షాపులు మూసివేసి చేపట్టిన సమ్మెకు మద్దతుగా శ్రీకాళహస్తి మెడికల్ అసోసియేషన్ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని బేరీవారి మండపం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో మెడికల్ షాప్ నిర్వాహకులు, ఫార్మసీ వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆన్లైన్ విధానంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్ని మందులు, మత్తు పదార్థాలు సులభంగా అందుబాటులోకి వస్తుండటంతో యువత మత్తుకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ ఫార్మసీ విధానం కారణంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు నిర్వహించే లక్షలాది మంది జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఆన్లైన్ మందుల విక్రయాలను నియంత్రించి, స్థానిక మెడికల్ షాపుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రామ్ గుప్తా – ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేటి గోపాల్ – శ్రీకాళహస్తి మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story