Srikalahasti: శ్రీకాళహస్తిలో MGM హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరం విజయవంతం!

Srikalahasti: శ్రీకాళహస్తి కొండమిట్ట, వెలమపాలెం సమీపంలో MGM హాస్పిటల్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి వైద్య పరీక్షలు చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 15 Nov 2026 2:46 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో MGM హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరం విజయవంతం!

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో MGM హాస్పిటల్స్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కొండమిట్ట, వెలమపాలెం పాల డిపో సమీపంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ వైద్య శిబిరానికి కొండమిట్ట, ఎన్టీఆర్ నగర్, వెలమపాలెం ప్రాంతాలకు చెందిన దాదాపు 200 మంది ప్రజలు హాజరై ఉచిత వైద్య సేవలను పొందారు.

ఈ సందర్భంగా MGM హాస్పిటల్స్ వైద్య నిపుణులు డాక్టర్ వివేక్ చైతన్య (గుండె వైద్య నిపుణులు), డాక్టర్ ఉమా మహేశ్వరరావు (చిన్నపిల్లల వైద్య నిపుణులు), డాక్టర్ కార్తీక్ (ఎముకల వైద్య నిపుణులు), డాక్టర్ అర్చన (దంత వైద్య నిపుణులు), డాక్టర్ పవన్ తదితరులు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా MGM హాస్పిటల్స్ డైరెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ.. MGM హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించామని, భవిష్యత్తులోనూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మరిన్ని వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు.

అలాగే MGM హాస్పిటల్స్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ, EHS సేవలతో పాటు ప్రస్తుతం ESI (కార్మికుల బీమా) వైద్య సేవలు కూడా 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ సేవలను శ్రీకాళహస్తి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం స్థానికుల ప్రశంసలు అందుకుంది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI