Srikalahasti: శ్రీకాళహస్తి పరిశ్రమలో ఎమ్మెల్యే బొజ్జల పర్యటన!
Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లోని కోకా-కోలా బెవరేజెస్ పరిశ్రమను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సందర్శించి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు.
Srikalahasti: శ్రీకాళహస్తి పరిశ్రమలో ఎమ్మెల్యే బొజ్జల పర్యటన!
శ్రీకాళహస్తి: ఈ రోజు కోకా-కోలా హిందుస్థాన్ బెవరేజెస్ సంస్థ యాజమాన్యం ఆహ్వానం మేరకు శ్రీకాళహస్తిలోని వారి పరిశ్రమను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్లాంట్‌లో పానీయాల తయారీ విధానం, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక యంత్రాలతో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ, ప్యాకింగ్ విధానాలను పరిశీలించారు. పరిశ్రమలో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు, సాంకేతికతను అభినందించారు.
అనంతరం మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న ఈ పరిశ్రమ మరింతగా విస్తరించి స్థానిక యువతకు అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా కోకా-కోలా సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
సంస్థ యాజమాన్యం, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు మరింత అభివృద్ధి సాధిస్తూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ప్లాంట్ కార్యకలాపాలపై వివరాలను తెలియజేసి, అతిథులను ఘనంగా ఆహ్వానించారు.




