Srikalahasti: శ్రీకాళహస్తి ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు: డీఎస్పీ!
Srikalahasti: శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ పావని స్పష్టం చేశారు.
Srikalahasti: శ్రీకాళహస్తి ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు: డీఎస్పీ!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ మరియు చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 14, 15, 16 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 15, 16, 17 తేదీల్లో నామినేషన్లను స్వీకరిస్తారని తెలియజేశారు. మున్సిపాలిటీ, పంచాయతీ రెండింటికీ ఈ నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని మొత్తం 44 వార్డుల్లో భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. హైపర్ సెన్సిటివ్ (అత్యంత సమస్యాత్మక) వార్డులు: 18 సెన్సిటివ్ (సమస్యాత్మక) వార్డులు: 18సాధారణ వార్డులు: 8 (7 వార్డులు ఎటువంటి ఇబ్బందులు లేనివిగా గుర్తింపు) పట్టణ వ్యాప్తంగా 44 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 88 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి, అక్కడ గట్టి బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి.
ఎన్నికల సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రజలు ఎవరూ గుమిగూడి ఉండవద్దని డీఎస్పీ సూచించారు. రౌడీషీటర్లు కేవలం తమ ఓటు హక్కును వినియోగించుకుని వెంటనే పోలింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోవాలని, నిబంధనలు ఉల్లంఘించి అక్కడే తచ్చాడితే కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటికే 200 మందికి బైండోవర్ నోటీసులు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ పావని గారు విజ్ఞప్తి చేశారు.




