Srikalahasti: శ్రీకాళహస్తిలో 87వ వారం డొక్కా సీతమ్మ అన్నదానం
Srikalahasti: శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 87వ వారం డొక్కా సీతమ్మ అన్నదానం. పవన్ కళ్యాణ్ ఆశయాలతో అన్నదాన కార్యక్రమం.
Srikalahasti: శ్రీకాళహస్తిలో 87వ వారం డొక్కా సీతమ్మ అన్నదానం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా, పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 87వ వారానికి చేరుకున్న శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిరుపేదలు, ప్రయాణికులు మరియు అవసరమైన వారికి అన్నదానం చేసి మానవతా సేవను చాటుకున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, పసల సురేష్, ప్రదీప్ కుమార్, నవీన్, మునిచంద్ర, రాజా, చందు పాల్గొన్నారు.
అలాగే వీర మహిళలు, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ, ప్రసన్న, భారతి, వల్లి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




