Srikalahasti: శ్రీకాళహస్తి ఫ్యాక్టరీలో గంజాయి పరీక్షలు, పోలీసుల అవగాహన
Srikalahasti: శ్రీకాళహస్తి రూరల్ సీఐ ఇబ్రహీం ఆధ్వర్యంలో ప్రకాష్ ఫెర్రస్ ఫ్యాక్టరీలో గంజాయి నిర్మూలన అవగాహన సదస్సు. కార్మికులకు గంజాయి నిర్ధారణ పరీక్షల నిర్వహణ.
Srikalahasti: శ్రీకాళహస్తి ఫ్యాక్టరీలో గంజాయి పరీక్షలు, పోలీసుల అవగాహన
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి నిర్మూలనకు పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా, ఈ రోజు ఊరందూరు–పంగూరు రోడ్డులోని ప్రకాష్ ఫెర్రస్ ఫ్యాక్టరీలో కార్మికులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇబ్రహీం మాట్లాడుతూ, గంజాయి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలతో పాటు మాదకద్రవ్యాలకు సంబంధించిన చట్టపరమైన కేసులు, శిక్షలపై కార్మికులకు అవగాహన కల్పించారు. అనంతరం ఫ్యాక్టరీ కార్మికులకు గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
అలాగే గంజాయి సాగు, రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఇన్‌స్పెక్టర్ ఇబ్రహీం కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఆయన హామీ ఇచ్చారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో కీలకమని, యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.




