Srikalahasti: కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో అర్చకుడిపై దాడి
Srikalahasti: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ ప్రాంగణంలో అర్చకుడిపై దాడి. పొరుగు సేవల సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన ఆరోపణలతో ఘటన.
Srikalahasti: కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో అర్చకుడిపై దాడి
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ ప్రాంగణంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న నరసింహమూర్తి స్వామిపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం.
కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న KLT పొరుగు సేవకుల పట్ల అర్చకుడు నరసింహమూర్తి స్వామి అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు రావడంతో, సంబంధిత వ్యక్తుల బంధువులు ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఎదుట నరసింహమూర్తి స్వామిపై దాడి చేసి చితకబాదినట్లు సమాచారం. ఘటనతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు దాడికి సంబంధించిన విషయాన్ని అర్చకుడు నరసింహమూర్తి స్వామి గోప్యంగా ఉంచుతూ, పోలీసు కేసు వరకు వెళ్లకుండా రాజీ మార్గంలో సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
ముక్కంటి ఆలయ ప్రాంగణంలో అర్చకుడిపై దాడి జరగడం చర్చనీయాంశంగా మారగా, ఆలయ అధికారులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.




